Header Banner

మాజీ మంత్రి పెద్దిరెడ్డి కి బిగ్ షాక్.. హైకోర్టులో దక్కని ఊరట.. పలు సర్వే నంబర్లలో.!

  Fri May 23, 2025 11:59        Politics

అటవీ భూముల ఆక్రమణకు సంబంధించిన వివాదంలో వైసీపీ నేత, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రతికూల ఫలితం ఎదురైంది. తమపై అటవీశాఖ అధికారులు నమోదు చేసిన క్రిమినల్ కేసుల విచారణను నిలిపివేయాలని కోరుతూ వారు దాఖలు చేసుకున్న అనుబంధ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ క్రిమినల్ కేసులపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ జస్టిస్ చల్లా గుణరంజన్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

 

ఇది కూడా చదవండి: ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

చిత్తూరు జిల్లా మంగళంపేట ప్రాంతంలోని పలు సర్వే నంబర్లలో తమ ఆధీనంలో ఉన్న సుమారు 75.74 ఎకరాల భూమిని ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, అలాగే పెద్దిరెడ్డి తమ్ముడి భార్య పి. ఇందిరమ్మ కలిసి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, తమపై అటవీశాఖ చేపట్టిన క్రిమినల్ చర్యలను ఆపాలని కోరుతూ తాజాగా వారు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై స్టే విధించడానికి అంగీకరించలేదు. అయితే, పిటిషనర్ల అధీనంలో ఉన్న భూముల విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తే, చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటించాలని రెవెన్యూ, అటవీశాఖ అధికారులను గతంలో ఇదే హైకోర్టు ఆదేశించిన విషయాన్ని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో గుర్తుచేశారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! రూట్ లోనే ఫిక్స్ - నేషనల్ హైవేకు దగ్గరగా.!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Peddireddy #AndhraPradesh #YCP #ShockingNews #Tirupati